ఏపీ సీఎం,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎంత చురుకుగా ఉంటారో అందరికి విదితమే .ఆయన అధికారం కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు అని రాజకీయ వర్గాలు విమర్శిస్తుంటాయి .ఈ క్రమంలో మరో ఏడాదిన్నర లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలల్లో నరసరావుపేట పార్లమెంటు నియోజక వర్గ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసినట్లు వార్తలు వస్తోన్నాయి .ఈ విషయం గురించి బాబు ఆస్థాన మీడియాకి చెందిన ప్రముఖ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది .
ప్రస్తుతం ఈ నియోజక వర్గం నుండి ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు ను ఈ నియోజక వర్గం నుండి పోటీలోకి దింపనున్నారు అని ఆ వార్త సారాంశం .అందులో భాగంగానే కొద్దీ రోజుల నుండి నియోజక వర్గంలో ఇటు అధికార అటు పార్టీ కార్యక్రమాల్లో ఆయన క్రియాశీలకంగా మారారు. తండ్రి ఆశీస్సులతో ఆయన నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు.
పార్టీ సీనియర్, కొత్త నాయకులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ ముందు కు సాగుతున్నారు. అందుకే ఆయన శక్తి, సామర్థ్యాలను గుర్తించిన తెలుగు దేశం పార్టీ అధినాయ కత్వం ఇటీవలే రాష్ట్ర కమిటీలో కార్యదర్శి పదవిని ఇచ్చింది. అంతే కాకుండా రంగారావుకు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి నరస రావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి రాయపాటి స్థానంలో రంగారావు పోటీ చేయాలన్న తలంపుతో ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. రంగారావుకు టీడీపీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి పదవి లభించడంతో రాయపాటి అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి బాబు ఆస్థాన మీడియా వర్గం రాసిన వార్త నిజమో ..కాదో .?