Home / SLIDER / సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ -రూ. 6 లక్షల వడ్డీ లేని రుణం..

సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ -రూ. 6 లక్షల వడ్డీ లేని రుణం..

తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి లో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ  టీబీజీకేఎస్ అనేది ఉద్యమ సమయంలో పుట్టిన కార్మిక సంఘమని తెలిపారు. గతంలో ఈ రాష్ర్టాన్ని కాంగ్రెస్, టీడీపీ పరిపాలించాయని గుర్తు చేశారు.

ఆ రెండు పార్టీలు సింగరేణి కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇంతకాలం సింగరేణిలో ఏం జరిగిందో కార్మికులందరికీ బాగా తెలుసు అన్నారు.ఆయన ఇంకా మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు గృహ నిర్మాణం కోసం రూ. 6 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కార్మికులకు వృత్తిపన్ను రద్దు చేస్తామని తెలిపారు.

పదవీ విరమణ పొందిన సింగరేణి కార్మికులు పది సంవత్సరాలకు మించి బతకరు. వారి ఆరోగ్య సమస్యలపై ఎవరూ దృష్టి పెట్టలేదు. కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కార్మికులు ఏ మాత్రం భయపడాల్సిన పని లేదన్నారు. కార్మికుల తల్లిదండ్రులు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి చూపించుకునేలా అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రమాదంలో చనిపోయే కార్మికుల కుటుంబాలకు పరిహారం రూ. 25 లక్షలకు పెంచామని గుర్తు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat