హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ కాఫీ షాపులో ఉద్యోగిపై కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని అర్బన్ గిల్ కాఫీ షాపులో ఈ నెల 18న ఈ ఘటన చోటుచేసుకుంది. కాఫీ షాపులో పనిచేసే అబ్దుల్ గఫార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన రమేష్ అనే కానిస్టేబుల్ అకారణంగా దాడి చేశాడు.
రక్షకభటుడిననే విషయం మర్చిపోయి ఓ వీధి గూండాలా ప్రవర్తించాడు. ఉద్యోగిపై పిడిగుద్దులు కురిపించాడు. ఇంత జరిగినా సదరు ఉద్యోగి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.అయితే, దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీ బయటకు రావడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆరా తీశారు. కానిస్టేబుల్ రమేష్ దాడికి పాల్పడినట్లు నిరూపణ కావడంతో ఆయనను డీసీ పీ కార్యాలయానికి అటాచ్ చేయడంతో పాటు మెమో జారీ చేశారు.