తెలుగు సినీ ప్రరిశ్రమను కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ వ్యవహారం కుదిపేసింది. డ్రగ్స్ రాకెట్ దెబ్బకి టాలీవుడ్ మొత్రం రెండు గ్రూపులుగా విడిపోయింది. ఇప్పుడిప్పుడే డ్రగ్స్ విషయాన్ని మర్చిపోతున్న టాలీవుడ్ పై మరో బాంబ్ పేలింది. మొన్నటి వరకు సినీ వర్గాల్ని నిద్ర లేకుండా చేస్తున్న పైరసీని బీట్ చేస్తూ ఇప్పుడు రివ్యూల రచ్చ మొదలైంది. సినిమా సమీక్షల మీద ఒక్కో హీరో ఒక్కో అభిప్రాయాన్ని తెలియజేస్తూ గత నాలుగు రోజులుగా హాట్ టాపిక్ అవుతున్నారు. జై లవ కుశ సమీక్షకులు మీద ఎన్టీఆర్ వంకర టింకర కామెంట్స్ చెయ్యడంతో ఈ రివ్యూ రచ్చ స్టార్ట్ అయ్యింది. అయితే ఎన్టీఆర్ కొందరు విశ్లేషకులనే టార్గెట్ చేసాడు. ఇక మహేష్ అయితే సినీ విశ్లేషకుల తప్పేమి లేదని.. బావుంటే బావుందంటారు.. లేదంటే లేదన్నాడు.
అలాగే మంచు విష్ణు అయితే థియేటర్ లో సినిమా చూస్తూ ఆస్వాదించకుండా లైవ్ అప్ డేట్స్ ఏంటండీ అంటున్నాడు. అలాగే మరో బడా నిర్మాత అయిన శోభు యార్లగడ్డ కూడా విశ్లేషకులపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. అసలు సినిమా మొదటి షో పూర్తవ్వకముందే కొన్ని వెబ్సైట్ ట్వీట్ రివ్యూస్ రాస్తున్నాయంటున్నాడు. ఇక ఇప్పుడు మంచి ఫ్యామిలీ మరో హీరో మంచు మనోజ్ కూడా తాజాగా… ఎంతో కష్టపడి తీసిన…. వందల మంది శ్రమతో కూడిన సినిమాను ఇలా రివ్యూల పేరిట చంపకండని.. సినిమాను పూర్తిగా ఆస్వాదిస్తే అందులో ఏముందో అర్థమవుతుందని… దయచేసి అప్ డేట్స్ ఇవ్వడం మనుకోమని… నిర్మాత శోభు యార్లగడ్డ కి మద్దతుగా నిలిచాడు. మరి ఎన్టీఆర్ రివ్యూస్ మీద విరుచుకుపడగానే టాలీవుడ్ సీనియర్ నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ ఎన్టీఆర్ అలా అనకుండా ఉండాల్సిందని ప్రెస్ మీట్ పెట్టాడు. మరి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ రివ్యూ రచ్చకు ముగింపు ఎప్పుడోగానీ… ప్రస్తుతానికి మాత్రం ఈ రచ్చ తీవ్ర రూపం దాల్చేలాగే ఉంది.