టాలీవుడ్ బాక్సాఫీస్ కా బాప్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ సినీ రంగంలో ప్రవేశించి సెప్టెంబర్ 28 గురువారంతో పదేళ్ళు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరతో తొలి బ్లాక్ బస్టర్‌తో పాటు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన చెర్రి తొలి చిత్రం చిరుత మూవి 2007 సెప్టెంబర్ 28న విడుదలైంది. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ డెబ్యూ సినిమా మెగా అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటివరకూ ఎంట్రీ ఇచ్చిన అందరి హీరోల అరంగేట్ర సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది.
ఇక దశాబ్ద కాలంలో చెర్రీ నటించిన సినిమాల తక్కువే అయినా.. తనదైన శైలిలో జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నాడు. రచ్చ, నాయక్, ఎవడు, ధృవ చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు సాధించాడు. ఆరెంజ్, గోవిందుడు అందరివాడేలే లాంటి సినిమాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందాడు. మగధీర సినిమాతో చరణ్ బెస్ట్ యాక్టర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నాడు. డీమానిటైజేషన్ సమయంలో విడుదలైన ధృవ సినిమా 60 కోట్ల వరకూ వసూళ్లు చేయడం మరో రికార్డ్‌గా చెప్పొచ్చు. ఇక చరణ్ పదేళ్ళ సినీ ప్రస్థానంలో రామ్ చరణ్ సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్నాడి చెప్పొచ్చు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటిస్తోన్న రంగస్థలం 1985 సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదండీ చెర్రీ పదేళ్ళ సినీ ప్రస్థానం.