Home / MOVIES / మహానుభావుడు జెన్యూన్‌ షార్ట్ రివ్యూ..!

మహానుభావుడు జెన్యూన్‌ షార్ట్ రివ్యూ..!

దసరా బరిలో ఇప్పటికే ఎన్టీఆర్ జై లవకుశ , మహేష్ బాబు స్పైడర్ లతో సందడి చేస్తుండగా.. తాజాగా శుక్ర‌వారం శ‌ర్వానంద్ మ‌హానుభావుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కామెడీ ఎంటెర్టైనెర్‌గా రాబోతున్న మహానుభావుడు చిత్రంపై ప్రేక్ష‌కుల్లో విప‌రీతమైన ఆశ‌క్తి నెల‌కొంది. ఇక మ‌హ‌నుభావుడు ప్రీమియ‌ర్ షో రివ్యూ ఏంటంటే.. ఈ చిత్రంలో హీరో పాత్రకి ఓసిడి కారణంగా అతిశుభ్రత ఉండడంతో…. అతని వస్తువులనే కాక పక్కన వారి వస్తువులని కూడా శుభ్రం చెయ్యడం… ఇంకా ఈ అతిశుభ్రతతో పక్కన వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే హీరోయిన్ మాత్రం ఆ హీరోగారి అతిశుభ్రతకి పడిపోయి ప్రేమించేస్తుంది. అలాగే తన కుటుంబం లోని వాళ్ళని కూడా తన ప్రేమని ఒప్పిస్తుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో హీరోయిన్‌కి హీరో గారి అతిశుభ్రత వల్ల సమస్యలు రావడంతో తన ప్రేమను వదులుకుని వెళ్ళిపోతుంది.

మరి హీరో శర్వా హీరోయిన్ మెహ్రీన్ కోసం వాళ్ళ ఊరు వెళ్లి అక్కడ త‌న అతి శుభ్రతని వదిలేసి హీరోయిన్‌ని ఎలా మెప్పించాడనేది మిగ‌తా క‌థ‌. ఇక సినిమాలో కామెడీ అదిరిపోయింద‌ట‌. హీరో తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం తో సినిమా మొదలు అవుతుంది..హీరో ఓసీడీ (అతి శుభ్రత) తో బాధపడుతాడు..ఒకే ఆఫీస్ లో హీరో , హీరోయిన్లు వర్క్ చేయడం తో హీరోయిన్ ను చూడగానే హీరో ప్రేమలో పడతాడు..హీరోకు ఫ్రెండ్ రోల్ లో వెన్నెల కిషోర్ నటించాడు. ఈ ముగ్గురి మధ్య వచ్చే కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందట.హీరోయిన్ తండ్రి రోల్ లో నాజర్ నటించాడు..పల్లెటూరు లో పెద్ద ఫ్యామిలీ ఈయనకు ఉంటుంది..కూతురు అంటే నాజర్ కు ప్రాణం..ఇలా ఫస్ట్ హాఫ్ సాగుతుంది..సెకండ్ హాఫ్ లో హీరో ఆ పల్లెటూరు కు వెళ్లడం , అక్కడి వారి మర్యాదులలో చాల కష్ట పడతాడు. దానికి తోడు అతి మనోడి అతి శుభ్రత వల్ల ఇంకాస్త ఇబ్బంది పడుతుంటాడు..మరి హీరోయిన్ ప్రేమను ఎలా గెలుచుకుంటాడు..అనేది తెలియాలంటే వెండితెర ఫై చూడాల్సిందే.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat