టాలీవుడ్ యుత్ ఫుల్ డైరెక్టర్ మారుతి.. సక్సెస్ ఫుల్ యంగ్ హీరో శర్వానంద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మహానుభావుడు చిత్రం దసరాకానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యు.వి.క్రియోషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమొద్ లు సంయుక్తంగా తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. అర్ధరాత్రి నుండే ఈ చిత్ర ప్రీమియర్ షోస్ సందడి చేయడం మొదలు పెట్టాయి. దీంతో చిత్ర పబ్లిక్ టాక్ త్వరగా బయటకు వచ్చేసింది. మారుతి గత చిత్రం భలే భలే మగాడివోయ్ ప్లేవర్ తరహాలోనే ఈ సినిమా ఉందని.. ఆ మూవీలో నాని మతిమరుపుతో ఆకట్టుకుంటే , ఇందులో మాత్రం శర్వానంద్ (ఓసీడీ) అనే వింత వ్యాధి , అతి శుభ్రత తో ఆకట్టుకున్నాడు. ఏం చేసిన దానిలో శుభ్రత పాటిస్తాడు. చివరకు హీరోయిన్‌కు ముద్దు ఇవ్వాలన్న కూడా శుభ్రంగా ఉందా లేదా అనే అంత ఆలోచిస్తాడు. ఓవరాల్ గా సినిమా అంత కామెడీ , సెంటిమెంట్ , లవ్ ఇలా ఈ మూడు సమపాలనలో సాగుతుంది. థియేటర్స్ లోకి వెళ్లిన ప్రతి ప్రేక్షకుడు సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా శర్వానంద్ , వెన్నెల కిషోర్‌ల మధ్య సాగే కామెడీ బాగా వర్క్ అయ్యింది. అలాగే హీరో, హీరో తల్లి మధ్య వచ్చే సెంటిమెంట్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. దసరా బరిలో వచ్చిన ఈ మూవీ చక్కటి విజయం అందుకోవడంలో ఎలాంటి సందేహం లేదని పబ్లిక్ టాక్.