Home / MOVIES / మ‌హానుభావుడు సినిమా రివ్యూ.. నీటుగాడు మెప్పించాడా..!

మ‌హానుభావుడు సినిమా రివ్యూ.. నీటుగాడు మెప్పించాడా..!

రివ్యూ : మహానుభావుడు

బ్యానర్ : యువి క్రియేషన్స్‌

తారాగణం : శర్వానంద్‌, మెహ్రీన్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, భద్రం తదితరులు

కూర్పు : కోటగిరి వెంకటేశ్వరరావు

సంగీతం : ఎస్‌.ఎస్‌. తమన్‌

కళ : రవీందర్‌

ఛాయాగ్రహణం : నిజర్‌ షఫీ

నిర్మాతలు : వంశీ – ప్రమోద్‌

రచన, దర్శకత్వం : మారుతి

విడుదల తేదీ : సెప్టెంబర్‌ 29, 2017

టాలీవుడ్ యూత్‌ఫుల్ డైరెక్ట‌ర్ మారుతీ దర్శకత్వంలో శతమానం భవతి చిత్రంతో అంతర్జాతీయస్థాయి గుర్తింపు సంపాదించుకొన్న శర్వానంద్ మెహ్రీన్ జంటగా తెరకెక్కిన చిత్రం మహానుభావుడు. గతంలో మతిమరుపు అనే కాన్సెప్ట్‌తో భలే భలే మగాడివోయ్‌ను అందించిన మారుతి.. ఇప్పుడు అతి శుభ్రత (ఓసీడీ) అనే వింత వ్యాధి నేపథ్యంలో మహానుభావుడు చిత్రాన్ని తెరకెక్కించారు. మ‌రి ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ నీటుగాడి చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఏమేర‌కు అల‌రించిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సందే..!

ఆనంద్ (శ‌ర్వానంద్‌) సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. శుభ్రత, పరిశ్రుభతకు సంబంధించిన ఓసిడి వ్యాధితో బాధపడే పరమ నీటుగాడు. తన చుట్టూ ఉండే పరిసరాలు, వస్తువులు, మనుషులు అన్ని శుభ్రంగా ఉండాలని భావిస్తుంటాడు. చివరికి పెన్‌కి క్యాప్ లేకపోయినా.. వెతికి మరీ దానికి పెట్టేస్తాడు. తనది కాకపోయినా సరే.. నీట్‌గా ఏది కనిపించపోతే దాన్ని వెంటనే క్లీన్ చేసేస్తాడు. చివరికి తల్లికి జర్వమొచ్చినా పట్టించుకోకుండా ఆమెకి దూరంగా వుంటాడు. ఇతని పరమశుభ్రత కారణంగా చుట్టూ ఉన్నవాళ్లు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇదే క్రమంలో, శర్వానంద్ పని చేసే ఆఫీస్‌లో ఉద్యోగిగా మెహ్రీన్ జాయిన్ అవుతుంది.. సహజంగా, నీట్‌ నెస్‌స్ ను ఇష్టపడే ఆమె శర్వానంద్‌లో వున్న ఆ డిజార్డర్ని చూసే అతడి ప్రేమలో పడుతుంది. అతడితో పెళ్లికి తన ఫ్యామిలీని ఎలాగోలా ఒప్పిస్తుంది. కట్ చేస్తే.. ఏ డిజార్డర్ ని చూసి మెహ్రీన్ అతడ్ని ప్రేమిస్తుందో, అదే ఆమె మనసుని ఆ తర్వాత గాయపరుస్తుంది. దాంతో ఆమె అతనికి దూరం అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. శర్వానంద్ తిరిగి తన ప్రేమను పొందేందుకు ఏం చేశాడు.. అనేది తెర‌పై చూడాల్సిందే.

ఓసీడీ డిజార్డర్‌ కాన్పెప్ట్‌తో హాలీవుడ్ లో అనేక సినిమాలు వచ్చాయి. అయితే, ఈ జోనర్‌లో వచ్చిన తొలి తెలుగు సినిమా మహానుభావుడు. తొలి అర్థభాగంలో శర్వానంద్ పాత్ర ద్వారా ఓసీడీ వ్యక్తులు ఎంత ఎక్స్‌ట్రీమ్‌గా ప్రవర్తిస్తారో అత్యంత హాస్యంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు మారుతి. ఇక ద్వితియార్ధంలో ప్రేయసి ప్రేమను గెలుచుకోవడానికి ఆమె సొంత గ్రామానికి వెళ్లి.. ఈ డిజార్డర్‌ కారణంగా శర్వా ఇబ్బందులు పడటం.. దీనిని అధిగమించి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడన్న విషయాన్ని ఎక్కడా పెద్దగా బోర్‌ కొట్టకుండా మారుతి తీయగలిగాడు. ఈ సినిమా ద్వారా కథను అద్భుతంగా నేరేట్ చేయగల తన సామర్థ్యాన్ని మారుతి మరోసారి నిరూపించుకున్నాడు. సినిమా అంతా కామెడీ ఎక్కడా మిస్‌ కాకుండా చూసుకోగలగడంతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ టచ్‌ చేసే ఎమోషన్స్‌ ని కథలోకి అద్భుతంగా చొప్పించగలిగాడు. ఇక అక్క‌డ‌క్క‌డా భలే భలే మగాడివోయ్ ఛాయలు కనిపించినప్పటికీ.. సామాన్య ప్రేక్షకుడికి అవేమీ పట్టకపోవచ్చు.

ఓసీడీ డిజ్ ఆర్డర్ కలిగిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో శర్వానంద్ సునాయాసంగా పోషించాడు.. అతడి కామెడీ టైమింగ్‌ కూడా గతంలో కంటే మెరుగైంది. ఇక హీరోయిన్ మెహ్రీన్ అందంగా ఉండటంతో పాటు తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. హీరో- హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఇక, హీరో ప్రక్కన ఉండే ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్‌ తనదైన హాస్యంతో ప్రేక్షకులిని నవ్విస్తాడు. నాజర్‌, యూట్యూబ్ స్టార్ జిడ్డేష్‌గా భద్రం తదితరులు చక్కటి ఫెర్‌ఫార్మెన్స్ అందించారు. టెక్నీషియన్స్ విషయానికొస్తే.. త‌మ‌న్ సాంగ్స్ ఆక‌ట్టుకున్నాయి.. ముఖ్యంగా టైటిల్ సాంగ్ బాగా కుదిరింది.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇర‌క్కొట్టాడు. నాజ‌ర్ ష‌ఫీ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ప్రతి సన్నివేశాన్ని ఎంతో అందంగా త‌న కెమ‌రాలో బంధించాడు. పల్లెటూరి వాతావరణాన్ని కూడా సినిమా సూపర్‌గా.. నీట్ గా చూపించాడు. ప్రొడక్షన్‌ వేల్యూస్ బాగున్నాయి.

# రేటింగ్ : 3/5
# ద‌రువు పంచ్ : ఈ నీటుగాడు భ‌లే భ‌లే..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat