Home / ANDHRAPRADESH / జ‌గ‌న్ పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జేసీ.. పులిహోర‌ ప్యాకెట్ అందిన‌ట్టుంది..!

జ‌గ‌న్ పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జేసీ.. పులిహోర‌ ప్యాకెట్ అందిన‌ట్టుంది..!

ఏపీ రాజ‌కీయ వ‌ర్గాలు ఊహించినట్లే అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌రోసారి మాట మార్చారు. ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రస్తావించిన సమస్యలను తీర్చడానికి అంగీకరించారని, అందువల్ల తాను లోక్ సభకు రాజీనామా చేయడం లేదని ఆయన చెప్పారు. గ‌తంలో తాను ఎంపీగా అట్టర్ ప్లాప్ అయ్యానని జేసీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు రాజీనామా చేసినంత హాడావుడి చేసి.. తాను మాట మీద నిల‌బ‌డ‌ర‌ని మ‌రోసారి రుజువు చేశాడు. ఇక ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ జ‌గ‌న్ పై కూడా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఓసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం జగన్‌కు వచ్చిందని ఆ అవకాశాన్ని అతడు చేజేతులారా జారవిడుచుకున్నాడని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక జన్మలో జగన్‌ సీఎం అయ్యే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఇకపై రాజకీయాలు వదిలేసి వైఎస్ జగన్ వ్యాపారాలు చేసుకోవడం మంచిదని ఆయన అన్నారు. జగన్ కు నవరత్నాలు లేవు.. నాపరాళ్లు లేవు అంటూ ఎద్దేవా చేశారు. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే జగన్.. పాదయాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీంతో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో మండి ప‌డుతున్నారు.

జేసీ బుస‌కొట్టిన‌ప్పుడల్లా చంద్ర‌బాబు ఏదో ఒక తాయిలం ఇచ్చి తుస్సుమ‌ని ప‌డుకోబెడుతున్నార‌ని.. అంతే కాకుండా ప‌నిలో ప‌నిగా జ‌గ‌న్ పై ఉసిగొల్పు తున్నార‌ని.. దీంతో నోటి దూల జేసీ నోటికి హ‌ద్దే లేకుండా పోతోంద‌ని జేసీ పై విరుచుకుప‌డున్నారు. జ‌గ‌న్ సీఎం కాడ‌ని చెప్పడానికి ఈయేమ‌న్న జ్యోతిష్యుడా.. అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌కు సంబందించి ఒక్క కేసుకూడా రుజువు కాలేదు.. అయినా ప్ర‌తి వారం కోర్టుకు హాజ‌రు అవుతున్నాడు. అంత మాత్రానా పాద‌యాత్ర చేయ‌కూడ‌ద‌ని రాజ్యాంగంలో ఏమ‌న్నా రాసుందా.. ప్ర‌జ‌ల్లో నీకెలాగూ విలువ లేదు.. అయినా జ‌గ‌న్‌ను తిట్ట‌డం చంద్ర‌బాబు నుండి పులిహార ప్యాకెట్ తీసుకోవ‌డం.. ఇదేగా నీ ప‌ని.. మ‌ళ్ళీ ఎద‌వ రాజీనామా డ్రామాలు.. నువ్వు నీ ప‌చ్చ ఆలోచ‌న‌లు ఎవ‌రికి చెబుతావ్ అంటూ జేసీ పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో ద్వ‌జ‌మెత్తుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat