ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకి అవసరాకి వాడుకోవడం.. అవసరం తీరాక వదిలేయడం వెన్నతో పెట్టిన విధ్య. ఇప్పటికే తన వాడకానికి బలి అయ్యి.. అసంతృప్తికి గురైన నేతలు పార్టీని వీడగా.. కొందరు టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం చూస్తే టీడీపీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. టీడీపీ ఆవిర్భావం నుంచి ముఖ్యమైన నేతగా కొనసాగుతున్న సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతి రాజుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి లోకేష్ ల వైఖరి అంతగా నచ్చడం లేదంటూ మీడియాలో వార్తలు వస్తుండడం ఆశ్చర్యంగా ఉంది. ఇంతకాలంగా చంద్రబాబుకు అండగా ఉన్న అశోక్ ఇటీవలి కాలంలో తన పట్ల పార్టీ చూపుతున్న వైఖరికి అసంతృప్తి చెందారని ఆ కథనాలు చెబుతున్నాయి.
అశోక్ కుమార్తె అతిధి ఒక అదికారిక కార్యక్రమంలో పాల్గొనడంపై ముఖ్యమంత్రి అభ్యంతరం చెప్పారని, దానికి అశోక్ మనస్తాపతం చెందారని అంటున్నారు. ఇక అదే సమయంలో చిరకాల ప్రత్యర్థులైన బొబ్బిలిరాజులను టీడీపీలోకి చేర్చుకోవడం, అనంతరం సుజయ్‌కృష్ణకు మంత్రి పదవి ఇవ్వడం ఇవన్నీ గజపతిరాజుకు చెక్ పెట్టే చర్యలుగానే భావిస్తున్నారు. చివరకు విజయనగరం డివిజన్ లోనూ అశోక్‌గజపతిరాజుకు వ్యతిరేకంగా మంత్రి గంటా శ్రీనివాస్‌రావును నారా లోకేష్ ఉసిగొల్పుతున్న తీరు గజపతిరాజుకు ఇబ్బందిగా మారింది. అశోక్‌లో గూడుకట్టుకున్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ఆయనను బీజేపీలో చేర్చుకోవాలని ఆ పార్టీ అదినేతలు మోడీ, అమిత్ షాలు భావిస్తున్నారట. అశోక్‌కు గవర్నర్ పదవి ఇచ్చి, ఆయన కుమార్తె అతిధికి ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని కూడా బీజేపీ ఆలోచనగా ఉందని ఆ కథనాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా టీడీపీ అదిష్టానంపై అశోక్ గజపతి రాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. టీడీపీకి గుడ్‌బై చెప్పినా ఆశ్యర్యం లేదని ఆపార్టీ వర్గీయులే చర్చించుకుంటున్నారు.