ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. చంద్రబాబు తాజాగా చేసిన ఆదేశాలు అమలు కాలేదు. దసరా పండగకు ముందే ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లనున పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కాని ఉన్నతాధికారులు దీనిని అమలుపర్చలేక పోయారు. సిబ్బంది జీతాలను, పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీనే చెల్లించింది. ఏపీ ప్రభుత్వం కూడా అందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే బ్యాంకుల్లో సర్వర్ల సమస్య కారణంగా పింఛన్లను, ఉద్యోగుల జీతాలను అధికారులు సకాలంలో అందించలేక పోయారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లనే జీతాలు, పింఛన్లను అందించలేక పోయామని, కొందరికి మాత్రమే జీతాలు అందాయని ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. దసరా, ఆదివారం, గాంధీ జయంతి ఇలా వరుస సెలవులు ఉండటంతో పండక్కి ఏపీ ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ చేసిన వారికి పింఛన్లు ఇప్పుడు అందనట్లేనని.. వచ్చ నెల 3వ తేదీనే చెల్లింపులు జరగుతాయని సమాచారం.
