ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు డప్పు మీద డప్పు కొట్టారు. అయితే రాష్ట్రంలో పరిస్థితి అందుకు బిన్నంగా ఉంది. మీడియాలో దీనిపై వస్తున్న కదనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈనాడు సైతం ప్రజలకు ఎదురవుతున్న అనారోగ్యం, మరణాలు సంభవిస్తున్న తీరుపై ఒక కదనాన్ని ఇచ్చింది. విషజ్వరాలతో ప్రకాశం జిల్లాలో గడిచిన 40రోజుల వ్యవధిలో ఏకంగా 67మంది మృత్యువాత పడ్డారని, వేలమంది నేటికీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆ పత్రిక తెలిపింది. రోజుకి ఒకరో, ఇద్దరో వీటివల్లనే మృత్యువాత పడుతున్నారు. ఇప్పుడిప్పుడే యంత్రాంగమంతా పల్లెలకు వెళ్తున్నా.. మరణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా బుధవారం ఇద్దరు, గురువారం మరో ఇద్దరు మరణించడంతో అధికారులు ఆలస్యంగానైనా అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ లెక్కలు ప్రకారం జిల్లావ్యాప్తంగా 95వేల మంది జ్వర పీడితులున్నా.. ప్రైవేటుగా చికిత్స తీసుకుంటున్న వారు మూడున్నర లక్షల మందికి పైగా ఉన్నట్లు అంచనా అన ఈనాడు తెలిపింది. ఈ జ్వరాల్లో ఏది డెంగీ, ఏది కాదనేది నిర్థరణ సక్రమంగా జరగడం లేదని కూడా పేర్కొన్నారు. డెంగి వ్యాదికి 300 పైగానే గురయ్యారని కూడా వివరించింది. ఇది చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అనారోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చడానికి చంద్రబాబు సర్కార్ నిరంతర కృషి చేస్తోందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.
