Home / SLIDER / సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలెట్స్ ..

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలెట్స్ ..

తెలంగాణ భవన్‌లో సింగరేణి కార్మికులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు .ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నేడు  రోజు సింగరేణి గుర్తింపు సంగం ఎన్నికలు జరుగుతుంన్నాయి..టీబీజీకేఎస్ గెలిపించే బాధ్యత నాపై ఉంది.గతంలో 60 సంవత్సరలా నుండి కాంగ్రెస్, టిడిపి అధికారంలో ఉన్నాయి.ఏఐటీయూసీ, సీపీఐ అనుబంధ సంస్థలు మాత్రమే సింగరేణి లో కార్మిక సంఘాలు పనిచేశాయి.సింగరేణి లో జరిగిన డమేజ్ అందరికి తెలుసు.సింగరేణి లో జాతీయ పార్టీ మాది చెప్పుకుంటున్నారు.

ఉద్యమ సమయంలో ఏర్పడ్డ సంస్థ tbgks .డిఫెండేట్ ఉద్యోగుల కోసం గతంలోనే అన్ని సంఘాలు సంతకాలు చేశాయి.సోకాల్డ్ జాతీయ సంఘాలు కూడా చెప్పుకుంటున్నా వారికి కూడా తెలుసు.సింగరేణి అండర్ గ్రౌండ్ లో పని చేసే కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉంటుంది.
గతంలో నాకుడా వాళ్ళ పరిస్థితి తెల్వదు .కార్మికుల ను పిలిపించుకుని క్లాస్ చెప్పిచుకున్నాను.వాళ్ళ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంటుంది.మోకాళ్ళ చిప్పలు అరుగుతాయి.

ఆక్సిజన్ అందక చాలా మంది కార్మికులు చనిపోయిన పరిస్థితి మనకు తెలుసు.తెలంగాణ వస్తే అది పునరుద్ధరణ చేస్తామని చెప్పం . చెప్పనట్లు చేశాం కానీ విల్లు కోర్టులకు వెళ్లి స్టే లు తెచ్చారు. కోర్ట్ ల కోసం ముఠాలు తయారు చేశారు. స్టే వచ్చిన రోజు స్వీట్స్ కూడా పంచుకున్నారు ఆ దుర్మార్గులు.త్వరలో ఆ ముఠాను బయట పెడుతా…న్యానిపునలతో మాట్లాడితే దీనికి పరిస్కారం ఉంటది అని వారు చెప్పడం జరిగింది.
డిఫిండెంట్ ఉద్యోగుల 100 శాతం చెయ్యచ్చు అని చెప్పారు.

కారుణ్య నియమాలను వద్దు అనుకుంటే గతంలో 5 లక్షలు మాత్రమే ఉండే కానీ మేము 12 చేశాం.కానీ ఇప్పుడు మళ్లీ దాన్ని 25 లక్షలు చేస్తాం.
సో కాల్డ్ జాతీయ పార్టీలు, సంఘాలు అని చెప్పుకునే వారు దొంగ పేరుతో చెప్పుకునేి జాబ్ చేసుకున్న వారు దందాలు చేయించేవారు ఎవ్వరో అందరికి తెలుసు.కానీ మేము వాళ్ళను స్వంత ఉద్యోగులుగా చేస్తాం. కార్మికుల పిల్లకు ,తల్లిదండ్రులకు అందరికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించే అవకాశం కల్పిస్తాం.

ఇండ్లు కట్టుకోవడానికి 6 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇస్తాము.లాభాల్లో వాటా 25 శాతం పెంచాం ఈరోజు ఇస్తున్నాం.వృత్తి పన్ను,ఇన్కమ్ టాక్స్ ను రద్దు చేయాలని డిమాండ్ ఉంది. సింగరేణి కార్మికులు చెల్లించే 175 కోట్ల పన్నును రద్దు చేసింది మేమె.రాబోయే శీతాకాల సమావేశాల్లో యుద్ధం కూడా చేస్తాం.అవసరమా అయితే ఇతర రాష్ట్రాల ఎంపీల మద్దతు తో యుద్ధం చేస్తాం.గతంలో 17 మంది కార్మికులకు ఎక్సగ్రేషియా పెంచుమంటే పెంచలేదు చంద్రబాబు నాయుడు కానీ మేము ధర్నా చేసి 6 లక్షల వరకు పెంచారు. కానీ ఇప్పుడు 25 లక్షలఏక్షగ్రేషియా చేశాం.3527 మంది కి డిఫెండేట్ ఉద్యోగాలు ఇప్పించాము వారు అంత మాకే ఓట్లు వేస్తారు.

500 మందిని నిర్ధక్ష్యంగా తీసేస్తే వారికి మేమె ఉద్యోగం కల్పించాం.అందరు కలిసి మా మీద పోటీ చేస్తున్నారు. అన్ని జెండాలు ఒక్కటి అయ్యాయి.మా ఒక్కల నుండి శతకాకా అందరూ ఒక్కటి అయ్యారు. గతంలో tbgks ఎక్కువ మెజారిటీ వస్తది అని మాకు సమాచారం ఉంది.
డిఫెండేట్ ఉద్యోగాలు ఎక్కడకు పోవు. ఎందుకంటే వాటిని కారుణ్య నియామకాల కింద ఇప్పిస్తాం. కారుణ్య నియమాకాలు వద్దు అని ఎవ్వరు అనలేదు.సమేఖ్య పాలనలో ఆర్టీసీ నెత్తిమీద కత్తి వెళదాడేది.కానీ ఆర్టీసీ రక్షించాం.విద్యుత్ సంస్థను కూడా ముందుకు తీసుకవెళ్ళాం. మా మీదా ఎంత ఒత్తిడి వచ్చిన వెనుకకు పోలేదు.1.10 లక్షల ఉద్యోగాలు ఉన్న సింగరేణి సంస్థను 50 వేలకు తెచ్చిన ఘనత ఎవ్వరిది అండి వాళ్ళది కాదా…
రాబోయే రోజుల్లో ఇతర దేశాలలో కూడా సింగరేణి ఉద్యోగలు కల్పిస్తాం.

బయ్యారం లో స్టీల్ ప్లాంట్ పెట్టమని కేంద్రం ను కోరాం కానీ వారు పెద్ద పోజులు కొడుతున్నారు.బయ్యారం ఉక్కు గనులను కూడా సింగరేణి కి అప్పగిస్తాం.సింగరేణి కార్మికులకు నా మనవి రాష్ట్రంలో ముందుకు పోవాలి కావున ఒక్క ఉద్యోగం కూడా పోవు . మీ ఉద్యోగాలు మీకు ఇప్పిస్తాం . ఒక్కవేళ మీకు ఉద్యోగం వద్దు అంటే దర్జాగా 25 లాక్షలు తీసుకొని పోవచ్చు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat