తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో భద్రాది-కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి కొత్తగూడెంలో కార్మికులు సంబురాలు జరుపుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ ఎమెల్యే జలగం వెంకటరావు, శాసన మండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలతో పాటు, ఒకవేళ వద్దనుకుంటే ఉద్యోగానికి బదులు రూ.25 లక్షలు, ఎఎంసీ నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేలు పెంచడంఫై కొత్తగూడెంలో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపుకున్నారు.