తెలంగాణ రాష్ట్రంలో సింగరేణిలో బోగస్ ఉద్యోగులను రెండు నెలల్లో క్రమబద్దీకరిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ రోజు సింగరేణి ఎన్నికల గురించి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ సింగరేణిలో సుమారు 14 నుండి 19 వేల మంది ఉంటారని చెప్పారు.బోగస్ ఉద్యోగులను ప్రతి ఒక్కరూ బెదిరిస్తారని చెప్పారు. దీంతో బోగస్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని కెసిఆర్ చెప్పారు.వారసత్వ ఉద్యోగాల విషయంలో 3527 మంది తమకు అనుకూలంగా ఓటు చేస్తారని కెసిఆర్ చెప్పారు.