Home / SLIDER / సింగరేణి కార్మికులకు 25 శాతం లాభాల బోనస్…

సింగరేణి కార్మికులకు 25 శాతం లాభాల బోనస్…

తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు 2016-17 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన లాభాలపై 25 శాతం బోనస్ ను చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు, సింగరేణిని ఆదేశించారు. ఇది మొత్తం రూ. 98.84 కోట్లు అవుతుంది. ఈ మొత్తాన్ని దసరాకు ఒకరోజు ముందు అనగా శుక్రవారం కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే గతంలో ప్రకటించిన పి.ఎల్.ఆర్ (దీపావళి) బోనస్ రూ.57వేల రూపాయలను కూడా దీనితో పాటు కలిపి శుక్రవారం నాడే చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.వాస్తవానికి పి.ఎల్.ఆర్ (దీపావళి) బోనస్ ను అక్టోబర్ రెండవ వారంలో దీపావళి పండుగకు ముందుగా చెల్లించాలని ప్రకటించినప్పటికీ, వెనువెంటనే వచ్చిన పండుగలు, కార్మికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రముఖ్యమంత్రివర్యులు రెండు బోనస్ లు కలిపి ఒకేదఫాగా శుక్రవారం (29-09-2017) నాడు చెల్లించాలని కంపెనీని ఆదేశించారు.

ఈమేరకు సింగరేణి సంస్థ చైర్మెన్ అండ్ ఎమ్.డీ శ్రీ N. శ్రీధర్ ఆర్ధిక శాఖవారికి తక్షణమే ఆదేశాలు జారీచేయగా శుక్రవారం (29-09-2017) నాడు కార్మికుల ఖాతాల్లో రెండు బోనస్ ల సొమ్ము జమచేయడానికి రంగం సిద్ధమైంది. దీపావళి బోనస్ రూ. 57వేల రూపాయలతో పాటు, 25 శాతం లాభాలవాటా సగటున సుమారు 15 నుండి 20 వేల రూపాయలు కలిపి నేడు ప్రతి కార్మికుని ఖాతాలో 72 నుండి 77 వేల రూపాయలు జమ కానున్నాయి. ఇది కాక ఈ నెల 22వ తేదీన దసరా పండుగ అడ్వాన్సుగా ప్రతి కార్మికునికి కంపెనీ 25వేల రూపాయలు చెల్లించింది. మొత్తంమీద చూస్తే, ఈ పండుగల సీజన్లో ప్రతి కార్మికుడు సగటున లక్ష రూపాయలను పొందగలిగాడు. కంపెనీ దసరా పండుగ అడ్వాన్సుగా రూ.120 కోట్లను ఈనెల 22వతేదీన చెల్లించడం జరిగింది. దీపావళి (పి.ఎల్.ఆర్) బోనస్ కింద రూ. 336 కోట్లు, లాభాలవాటా కింద రూ. 98.84 కోట్లు కలిపి మొత్తం రూ. 434 కోట్లు శుక్రవారం నాడు చెల్లించడం జరుగుతుంది. దీనితో ఈ నెలలో మొత్తం సుమారు 554 కోట్ల రూపాయలు కార్మికులకు చెల్లించినట్లవుతుంది.

ఒకే సారిగా పెద్ద మొత్తంలో లక్షరూపాయలవరకూ చేతికి అందుతున్నందున అవసరాలకు తగిన విధంగా, పొదుపుగా జాగ్రత్తగా దీనిని వెచ్చించుకోవాలని సంస్థ సి అండ్ ఎమ్.డీ పిలుపునిస్తూ అందరికీ దసరా-దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు. లాభాల వాటా చెల్లింపులో ఇదే అధిక శాతం తెలంగాణా ప్రభుత్వం ఏర్పడక మునుపు కార్మికులకు లాభాల బోనస్ 20 శాతం లోపే ఉండేది. దానికి కూడా చాలా ప్రయత్నాలు, ఆందోళనలు తర్వాతనే ఇస్తుండేవారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావు గారు సింగరేణి కార్మికులపై గల ప్రత్యేక అభిమానంతో లాభాల బోనస్ ను గత మూడేళ్ళుగా భారీగా పెంచి ప్రకటిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికులకు వాటాగా చెల్లించిన మొత్తం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.తెలంగాణా రాకముందు లాభాల బోనస్ 18% ఉండగా దాన్ని తెలంగాణా వచ్చిన తర్వాత 2014-15 సంవత్సరానికి 21%, 2015-16 సంవత్సరానికి 23% పెంచి ప్రకటించగా 2016-17 సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు 25 శాతానికి పెంచి లాభాల బోనస్ ను ప్రకటించడం జరిగింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat