తెలంగాణ సింగరేణిలో కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి పునరుద్ఘాటించారు. సింగరేణి ఎన్నికల సందర్భంగా ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సింగరేణి కార్మికుల బాధలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.
సింగరేణి కార్మికుల బాధలు అందరికీ తెలిసిందే అన్నారు.ఇప్పుడు జరిగే ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలిస్తే ఏం చేస్తదో చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు సీఎం. సింగరేణిలోని 11 డివిజన్లలో టీబీజీకేఎస్ తప్పక గెలుస్తుందని ఘంటాపథంగా చెబుతున్నానని సీఎం అన్నారు.ఆయన ఇంకా మాట్లాడుతూ “సింగరేణిలో వారసత్వ ఉద్యోగానికి అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగం తీసుకోకపోతే రూ.25 లక్షలను పరిహరంగా ఇస్తామని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు.
వారసత్వ ఉద్యోగాల రిక్రూట్ మెంట్ జరగకుండా సుమారు 17 కేసులను కోర్టుల్లో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.వారసత్వ ఉద్యోగాల విషయంలో కేంద్రంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా బొగ్గుగనులున్న ప్రాంతాల రాష్ట్రాలను కలుపుకొని కేంద్రంపై పోరాటం చేస్తామని చెప్పారు.