తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్వరలోనే ఏపీ లో పర్యటించనున్నారు .ఈ క్రమంలో వచ్చే నెల ఒకటో తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత తనయుడి వివాహానికి హాజరు కానున్నారు .
దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వివాహానికి కెసిఆర్ హాజరవుతున్న పర్యటన షెడ్యూల్ ను జిల్లా అధికారులకు అందింది. జిల్లా అధికారులకు అందిన సమాచారం మేరకు వచ్చే ఆదివారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడ నుండి మధ్యాహ్నం 12.20 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 12.40 గంటలకు జిల్లాలోని వెంకటాపురం చేరుకుంటారు. అక్కడకి చేరుకున్న తర్వాత శ్రీరామ్ పెళ్లి వేడుకలో పాల్గొని 12.55 గంటలకు హెలికాప్టర్‌లో పుట్టపర్తికి చేరుకుంటారు .అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 1.20 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం నుండి విమానంలో 2.10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారని సమాచారం .