తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఆ గ్రామానికి చెందిన దళితులు మూడు తరాలుగా మూడనమ్మకాలను బలంగా నమ్ముతూ వస్తున్నారు .మూడు తరాలుగా దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆ పండగను ఎంతో ఉత్సాహంతో ఆనందంగా జరుపుకుంటుంటే ఆ గ్రామానికి చెందిన దళితులు మాత్రం ఏమి పట్టనట్లు ..తమకు ఏ మాత్రం సంబంధం లేదన్నట్లుగా వారు వ్యవహరించే వారు .
కానీ వారు ఈ సారి ఆ కట్టుబాటులకు ,మూడనమ్మకాలకు చరమగీతం పాడారు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో శాలిగౌరారం మండలంలో ఇటుకల పహాడ్ లో మూడు తరాల క్రితం బతుకమ్మ ఆడుతుండగా వాటిలో మాంసం ముద్ద పడింది అనే కారణంతో ..అలా బతుకమ్మ లో మాంసం పడటం అరిష్టం అని అప్పటి నుండి బతుకమ్మ ఆడటం మానేశారు .
అయితే ఈ సారి ఈ మూడనమ్మకలపై స్థానిక దళిత యువత అవగాహన కల్పించి గ్రామానికి చెందిన దళితులను చైతన్యవంతుల్నిచేశారు .దీంతో అందరు మూడు నమ్మకాలకు చరమగీతం పాడి ఆనందంగా ఉత్సాహంగా ఎంతో సంబరంగా బతుకమ్మ పండగను జరుపుకొని మూడనమ్మకాలను దూరం పెట్టి అందరికి ఆదర్శంగా నిలిచారు .