Home / ANDHRAPRADESH / టీడీపీకి ఆ ఇద్దరు గుడ్ బై – వైసీపీలోకి సోదరుడుతో సహా మాజీ సీనియర్ మంత్రి.

టీడీపీకి ఆ ఇద్దరు గుడ్ బై – వైసీపీలోకి సోదరుడుతో సహా మాజీ సీనియర్ మంత్రి.

ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి .ఈ నేపథ్యంలో అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు ,మాజీ మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లో చేరుతున్నారు .ఇప్పటికే టీడీపీ పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా చంద్రమోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు .నిన్న గురువారం ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ చిమటా సాంబు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు .

ఈ క్రమంలో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరిన ఆనం బ్రదర్స్ వైసీపీలో చేరతారు అనే వార్తలు వస్తోన్నాయి .గతంలోం పార్టీలో చేరే ముందు ఒకరికి ఎమ్మెల్సీ పదవితో పాటుగా టీడీపీ పార్టీలో మంచి ప్రాధాన్యత కల్పిస్తాను అని హమిచ్చి పార్టీలో చేర్చుకున్నాడు ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు .తీర పార్టీలో చేరి ఇన్నేండ్లు అయిన కానీ బాబు వాటి ఊసు తీసుకురకపోవడమే కాకుండా జిల్లా పార్టీ ,ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆనం బ్రదర్స్ ను పక్కన పెట్టడం వార్ని తీవ్ర మనస్థాపానికి గురి చేసింది అంట .

అంతే కాకుండా ఇటీవల ఆనం బ్రదర్స్ పార్టీ మారతారు అనే వార్తలు వచ్చిన సమయంలో బాబు వీరిద్దర్నీ అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి రప్పించుకొని మరి ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం రామనారాయణ రెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తాను అని హామీ ఇచ్చారు .కానీ ఆ పదవిని తాజాగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వియంకుడు అయిన పుట్టా సుధాకర్ యాదవ్ కు కట్టబెట్టనున్నారు అని తెలుగు తమ్ముళ్ళకు బాబు సమాచారం ఇచ్చాడు అంట .

దీంతో తమను నమ్మించి మోసం చేస్తోన్న బాబు పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు అంట .పార్టీలోకి ఇతర పార్టీల నుండి చేరుతున్నవారికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తోన్న గౌరవం ..ప్రాధాన్యత వీరిద్దర్ని తెగ ఆకట్టుకుంది అంట .దీంతో రాజకీయాల్లో ఎంతో సీనియర్లై ఉండి జిల్లాలో మంచి పట్టు ఉన్న తాము ఇక్కడే ఉండి అవమానాలను ఎదుర్కునే బదులు పార్టీ మారడమే మంచి నిర్ణయం ఆనం బ్రదర్స్ పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు అంట .దీంతో వీరిద్దరూ త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడం ఖాయం అని ..ఇప్పటికే జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో ఆనం బ్రదర్స్ సమావేశం అయ్యి జగన్ అప్పాయింట్మెంట్ కోసం చర్చలు జరిపారు అంట .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat