ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ,రాష్ట్రంలోని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అయిన జేసీ దివాకర్ రెడ్డి నిత్యం ఏదో ఒక సంచలనానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంటారు అనే విషయం విదితమే .ఇటీవల తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను .వచ్చే బుధవారం తన ఎంపీ పదవికి రాజీనామా చేసి లోక్ సభ స్పీకర్ కు అందజేస్తాను అని కూడా ఆయన ప్రకటించేశారు .అంతే కాకుండా తనని నమ్మి ఓట్లేసి గెలిపించిన నియోజక వర్గ ప్రజల కోసం ఏమి చేయలేకపోయాను .
నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించలేకపోయాను .అందుకే తనను నమ్మినవారికి న్యాయం చేయలేకపోయాను అనే రాజీనామా చేస్తున్నాను అని కొద్ది రోజుల క్రితం జేసీ మీడియా సాక్షిగా ప్రకటించారు .అయితే తాజాగా ఆయన తన నిర్ణయం మీద వెనక్కి వెళ్ళినట్లు అర్ధమవుతుంది .అంతే కాకుండా ఈ సందర్భంగా వైసీపీ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపించారు .
ఆయన మాట్లాడుతూ ఇప్పట్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు .ఆయన రాజకీయాలు మానేసి తన వ్యాపారాలు తాను చూసుకుంటే మంచిది .ఇది అంత తన శ్రేయోభిలాషిగా మాట్లాడుతున్నాను అని ఆయన అన్నారు .అయితే ఇచ్చిన మాటను తప్పి నీచ రాజకీయాలు చేసే జేసీ కంటే గత తొమ్మిది ఏండ్లుగా తనకు అధికారం లేకపోయినా నీతి నిజాయితీలతో పార్టీను నడిపిస్తున్న జగన్ వంద రెట్లు బెటర్ .జేసీ జగన్ కు సలహా ఇవ్వడం మాని నియోజక వర్గం గురించి ఆలోచిస్తే మంచిది అని అప్పుడే వైసీపే శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు .