తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జరగనున్న సింగరేణి ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు .మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు .మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “సింగరేణిలో టీబీజీకేఎస్ ను సింగరేణి కార్మికులు గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ టీబీజీకేఎస్ సంఘం వలనే కార్మికులకు ఉపయోగమని ఆయన అన్నారు. గత అరవై ఏండ్లుగా జాతీయ సంఘాలైన ఎఐటియుసి, ఐఎన్ టియుసి లు గుర్తింపు కార్మిక సంఘం గా ఎన్నికవుతూ వచ్చాయన్నారు.
కానీ తెలంగాణ ఉద్యమ నేపద్యంలో టిఆర్ఎస్ అనుబంద కార్మిక సంఘంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అవతరలించిందని అన్నారు. గతంలో వారసత్వ ఉద్యోగాలను వదలుకుంటామని గతంలో ఎఐటియుసి, ఐఎన్ టియుసి జాతీయ సంఘాలేనని చెప్పారు.ఇంతకాలం కాంగ్రెస్,తెలుగుదేశం ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించాయని, కాని ఆ పార్టీలు సింగరేణి ఆత్మను ఆర్ధం చేసుకోలేకపోయాయని ఆయన అన్నారు.వారసత్వ ఉద్యోగాలు అప్పనంగా ఇస్తున్న భావనను వాళ్ళు కల్గించారని అందుకే కోర్టు కూడా కొట్టివేసిందని ఆయన అన్నారు. కాని సింగరేణి కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉంటాయని , ఈ విషయాలు తాను తెలుసుకున్నానని ఆయన అన్నారు.
అండర్ గ్రౌండ్ కార్మికులకు ఆక్సిజన్ లభించదని, మోకాలి చిప్పలు అరిగి పోతాయని, అందువల్ల రిటైర్ అయ్యాక పది ఏళ్లు మించి జీవించలేరని, ఆ విషయం గత ప్రభుత్వాలు అర్దం చేసుకోలేదని కెసిఆర్ అన్నారు.వారసత్వ ఉద్యోగాలను తాము పునరుద్దరించామని, కాని కోర్టులు కేసులు కొట్టివేశాయని ,అప్పుడు కాంగ్రెస్ నేతలు స్వీట్ లు పంచుకున్నారని అన్నారు. కొన్ని ముఠాలు అచ్చంగా ఇదే పనిలో ఉన్నాయని,స్టేలు తేవడమే ఈ ముఠాలు పనిచేసి కేసులు వేస్తుంటాయని ఆయన అన్నారు.దీనిపై తాము న్యాయ నిపుణులతో మాట్లాడానని, కారుణ్య నియామకాలు చేయవచ్చని సూచించారని చెప్పారు.దాని ప్రకారం వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని సీఎం ప్రకటించారు.’డిపెండెంట్ ఉద్యోగాలు అర్ధం చేసుకోవడంలో కాంగ్రెస్, టీడీపీ విఫలమయ్యాయి. గతంలో పనిచేసిన కార్మిక సంఘాల వల్లే వారసత్వ ఉద్యోగాలు పోయాయి. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను గెలిపించాలి అని మనవి చేశారు .