ఏపీలో మరో దారుణం జరిగింది. తనకు పెళ్లి జరగకుండా తమ్ముడికే సంబంధం కుదిరిందన్న అక్కసుతో మరో కసాయి కొడుకు మద్యం మత్తులో కన్నతల్లి, తోడబుట్టిన తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డొచ్చిన తండ్రిని గాయపరచి పరారైయ్యమాడు. ఈ ఘటన విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం బొయితలి పంచాయతీ సదురుమామిడి గ్రామంలో జరిగిన దారుణం.
బొయితలి పంచాయతీ సదురుమామిడి గ్రామానికి చెందిన శ్రీను మద్యానికి బానిసై అందరితోనూ గొడవలు పెట్టుకుంటూ జులాయిగా తిరుగుతుండేవాడు. దీంతో అతనికి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో చిన్నకుమారుడు చంటిబాబుకు పెళ్లి చేద్దామని సంబంధం కుదిర్చారు. ఇది ఓర్చుకోలేని శ్రీను కన్న తల్లి, తండ్రి, తోడపుట్టిన తమ్ముడు నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చివరిన పడుకున్న తండ్రి లేచి పెద్ద కుమారుడిని నిలువరించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తండ్రిని గాయపరిచి శ్రీను అక్కడి నుంచి పరారయ్యాడు. మారుమూల ప్రాంతం కావడంతో వాహనాలు, అంబులెన్స్ గాని అందుబాటులో లేక తల్లి చిట్టమ్మ, చంటిబాబులు తెల్లవార్లూ కాలిన గాయాలతో బాధపడుతూ గడిపారు. ఎట్టకేలకు వైద్య సిబ్బందికి సమాచారం అందించి, ప్రత్యేక అంబులెన్స్‌లో ఉదయం 10.30 గంటలకు పాడేరు ఏరియా ఆసుపత్రి తీసుకొచ్చామని తండ్రి పోతురాజు బోరున విలపించాడు.
Tags brother fire crime family members vishaka