టీం ఇండియా పర్యటనలో ఉన్న ఆసీస్ నేడు బెంగుళూరు స్టేడియంలో జరగనున్న నాల్గో వన్డే మ్యాచ్ లో టాస్ గెలుచుకుంది .ఈ నేపథ్యంలో మొదట టాస్ గెలిచిన ఆ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆసీస్ జట్టుకు నాయకత్వం వహిస్తోన్న వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు ఈ మ్యాచ్ వందో వన్డే మ్యాచ్ కావడం విశేషం .
నాల్గో వన్డే మ్యాచ్ కు జట్టులో ఆసీస్ రెండు మార్పులు చేసింది. దీనిలో భాగంగా వేడ్, అడమ్ జంపాను తిరిగి జట్టులోకి తీసుకుంది. మరోవైపు టీంఇండియా మూడు మార్పులతో రంగంలోకి దిగుతుంది .ప్రస్తుతం ఉన్న కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రాలకు విశ్రాంతి కల్పించి వారి స్థానంలో ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమి, అక్షర్ పటేల్‌లను తీసుకున్నారు.