మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మురుగదాస్ దర్శకత్వం వహించిన స్పైడర్ మూవీ దసరా కానుకగా బుధవారం విడుదల అయ్యి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ బాక్సాఫీస్ వద్ద నిలుస్తునందో లేదో చెప్పాంటే ఈ వీకెంట్ తేలిపోనుంది. అయితే స్పైడ్ చిత్రం పై కావాలనే నెగిటీవ్ టాక్ స్పెడ్ అయ్యిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. అసలు విషయం ఏంటంటే స్పైడర్ విడుదలకు ముందురోజు సాక్షిలో మహేష్ ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ చేసింది కూడా వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఆ ఇటర్వూలో భాగంగా వైఎస్ గురించి ప్రశ్న అడగటం.. మహేశ్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ల గురించి గొప్పగా చెప్పడంతో అసలు సమస్య మొదలైందట. మహేష్ బావ మా పార్టీ ఎంపీ అయితే.. ఆయన జగన్‌కు జై కొట్టడమేంటని టీడీపీ నేతలు స్పైడర్ మూవీపై విషప్రచారం మొదలు పెట్టారని.. అంతే కాకుండా ఆ పార్టీకి సంబంధించిన ఇంటర్నెట్ వింగ్ ఈ వ్యవహారం మొత్తాన్ని నడిపించిందని మహేశ్ బాబు ఫ్యాన్స్ వారిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
అసలు థియేటర్లలో బొమ్మ పడకుండానే.. సినిమా ప్లాప్ అని డిజాస్టర్ అంటూ కామెంట్స్ పెట్టి.. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ప్రచారం నడిపించారని దీనిపై మహేశ్ ఫ్యాన్స్ కూడా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అంతే కాకుండా వైసీపీ ఎమ్మెల్యే రోజాది ఐరన్ లెగ్ అని మహేస్ మూవీ పోతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా నంద్యాల ఉప ఎన్నికల్లో బావ పార్టీకి కాకుండా వైసీపీకి సూపర్ స్టార్ అభిమానులు జై కొట్టడం, వారి తరపున ప్రచారం చేయడం.. ఆది శేషగిరి రావు స్వయంగా మహేశ్ ఫ్యాన్స్ మద్దతు వైసీపీకే అని చెప్పడంతో పచ్చ పార్టీ బ్యాచ్ జీర్ణించుకోలేక.. స్పైడర్ పై ఈ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారని.. సినిమా మరీ అంత ధారుణంగా ఏం లేదని పచ్చ బ్యాచ్ చేసిన నెగిటివ్ ప్రచారం ప్రేక్షకుల్లో బలంగా వెళ్ళడంతో.. ఆ ప్రభావం స్పైడర్ చిత్రం పై పడిందని.. ఏది ఏమైనా ఇప్పటికే చెత్త పాలిటిక్స్‌తో రాష్ట్రాన్ని గబ్బు పట్టించిన పచ్చ నేతలు ఇప్పుడు సినీ పరిశ్రమనూ భ్రష్టు పట్టిస్తున్నారని సర్వత్రా చర్చించుకుంటున్నారు.