ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అనంతపురం, రాయలసీమలోని ప్రధానసమస్యలన్నింటినీ పరిష్కరించాలని పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. కొందరికి భూదాహం ఉంటుందని, ఎన్ని వేల ఎకరాలను సంపాదించుకున్నా సరిపోదని, తనకు మాత్రం ఒక్క దాహమే ఉందని.., ప్రజాసమస్యలను పరిష్కరించడమే తన దాహమని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కేవలం ఒక్క గ్రామంతోనే సరిపోదని రాయలసీమ మొత్తంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన అబిప్రాయపడ్డారు. సీమాంధ్రలో సమస్యలన్నీ పరిష్కారం కావాలన్నదే తన కోరిక అని పవన్ అన్నారు.
