ఏపీ ముఖ్య మంత్రి టీడీనీ అధినేత చంద్రబాబు ఒకప్పుడు ఎన్డీఏ కూటమిని జాతీయ స్థాయిలో సమన్వయ పరిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రధాని అపోయింట్మెంట్ మాత్రం దక్కడం లేదు. ఒకటో రెండు నెలల నుంచి కాదు.. ఏకంగా ఏడాదిన్నర నుంచి కనీసం ముఖం కూడా చూపడం లేదు. తాజాగా సెప్టెంబర్ 25., 26 తేదీలలో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. 25న ముస్సోరిలో ఐఏఎస్ అధికారులకు శిక్షణా కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. అదే రోజు ప్రధానిని కలిసేందుకు ఏపీ భవన్ వర్గాలు ప్రయత్నించినా అది ఫలించలేదు. ఈ వార్త జాతీయ మీడియా చెవులో పడడంతో చంద్రబాబును ఆడేసుకుంటుంది.
ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఉండటంతో చంద్ర బాబుని కలవడం కుదరదని పీఎంఓ నుంచి సమాచారం వచ్చింది. ఆ తర్వాతి రోజు మోడీని కలిసేందుకు ప్రయత్నించినా జైట్లీ., ఇతర కేంద్ర మంత్రులతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. చంద్ర బాబుని ఉద్దేశపూర్వకంగా కలవడం లేదని ఇప్పటికే విస్తృత ప్రచారం ఉంది. వాటిని నిజం చేసేలా మోదీ వ్యవహార శైలి ఉండటానికి బలమైన కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. ఏపీలో బలపడుదామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ పై దుమ్మెత్తిపోస్తున్న పచ్చ మీడియా వెనుక చంద్రబాబు హస్తం ఉందని బీజేపీ అధిష్టానం బలంగా నమ్ముతోందని అందుకే ప్రతిపక్ష నేత జగన్‌కి అపాయింట్‌మెంట్ ఇచ్చిన మోడీ చంద్రబాబుకు మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని సర్వత్రా చర్చించుకుంటున్నారు.