ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజల బలహీనతలని క్యాష్ చేసుకోవడం అలవాటు. దేన్నయినా ఆయన ఈవెంట్ అనే యాంగిల్‌లోనే చూస్తుంటారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన అయినా.. గోదావరి – కృష్ణా పుష్కరాలు అయినా.. ఇంకేదైనా కావొచ్చు. ఈవెంట్ చేశామా.. క్యాష్ చేసుకున్నామా.. ఇదే ఆయన పద్దతి. అయితే ఈవెంట్ అన్నాక వర్కవుట్ అవ్వాలి కదా.. మేగ్జిమమ్ గిట్టుబాటు అయ్యేలా ఆయా ఈవెంట్లు వుండాలని తన నేతలకి చంద్రబాబు ఆదేశాలు ఇస్తుంటారు. విజయవాడ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను, తిరుపతిలో బ్రహ్మోత్సవాలను మంచి అవకాశాలుగా గుర్తించడంలో, పర్యాటక ఈవెంట్లుగా మలచడంలో మూడు ముఖ్యశాఖల అధికారులు తగిన శ్రద్ధ పెట్టలేకపోయారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దసరా కానుకగా, శ్రీశైలం దేవస్థానంలో లడ్డూ ధర పెరిగిన విషయాన్ని ఎలా మర్చిపోగలం. ప్రముఖ దేవాలయాల్లో ఎప్పటికప్పుడు ఎంట్రీ పాస్ (అదేనండీ, దర్శనం కోసం టిక్కెట్లు..) రేట్లు పెరుగుతూనే వున్నాయి. నిజానికి, భక్తిని పాలకులు ఎప్పుడో వ్యాపారంగా మార్చేశారు. వ్యాపారం – పర్యాటకం.. పైగా, దానికి టెంపుల్ టూరిజం అంటూ కలరింగ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ఆలోచన మాటెలా ఉన్నా రాజధాని హోదా వచ్చాక ప్రతి అంశం దోపిడీగానే మారిపోయింది. హోటళ్లు టారిఫ్‌లు పెరిగిపోయాయి. గతంలో నాలుగైదు వందలకు కూడా బెజవాడలో హోటల్ గదులు దొరికితే ఇప్పుడు మధ్య తరగతి వారు కూడా హోటళ్ల వైపు కన్నెత్తి చూడటానికి భయపడే పరిస్థితులు ఉన్నారు. అందినకాడికి సంపాదించేసుకోవాలనే యావ పెరిగిపోతున్నా వాటిని కట్టడి చేసే ప్రయత్నాలు మాత్రం జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తోంది. అయినా సామాన్యుల్ని దోచుకొవడంలో చంద్రబాబు పీహెచ్‌డి చేశారని.. ఇలాంటి స్కాంలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విధ్య అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.