ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ వెనుక దారిలో ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రత్యక్ష రాజకీయాలల్లోకి ఎమ్మెల్సీగా అడుగు పెట్ట్టిన లోకేషు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడా అని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఈ విషయమై టీడీపీ నుంచి క్లారిటీ ఏమి లేదు కాని, టీడీపీ అధినేతకు సన్నిహితంగా ఉండే కొందరు నాయకులు మాత్రం వచ్చే ఎన్నికల్లో లోకేశ్ కచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికవుతాడని అనుకుంటున్నారు. లోకేష్ ని వచ్చే ఎన్నికలలో చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి అసెంబ్లీకి పంపాలని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇక కొడుకుకోసం తన నియోజక వర్గాన్ని త్యాగం చేసి.. సేఫ్ జోన్‌లో నంద్యాల నియోజక వర్గం నుండి బరిలో దిగాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం. నంద్యాల ఉప ఎన్నికలో గెలవాలి కాబట్టి అప్పట్లో భూమా ఫ్యామిలీకి ప్రయారిటి ఇచ్చారు చంద్రబాబు. అఖిల ప్రియకి మంత్రి పదవి ఇచ్చి.. బ్రహ్మానంద రెడ్డికి నంద్యాల టికెట్ ఇచ్చి సానుభూతితో.. డబ్బుతో నంద్యాల ఉప ఎన్నికలో గెలచారు. ఇక భూమా ఫ్యామిలీతో అవసరం తీరిపోయింది కదా.. దీంతో భూమా కుటుంబానికి ఝులక్ ఇవ్వనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా అవసరానికి వాడుకోవడం.. అవసరం తీరాక తొక్కేయడం బాబుకు వెన్నతో పెట్టిని విద్య. అయితే ఈ వార్త ఆనోటా ఈ నోటా పడి భూమా ఫ్యామిలీ చెవులో కూడా పడడంతో తీవ్ర అసంతృప్తికి గురి అయ్యారని.. త్వరలోనే చంద్రబాబుతో ఏదో ఒక విషయం తేల్చుకోవాలని ఒక వేల బాబు గారు మొండి చెయ్యి చూపి భూమా ఫ్యామిలీని ఆళ్ళగడ్డకే పరిమితం చేయాలని చూస్తే రాజీనామా అస్థ్రం ప్రయోగించాలని భావిస్తున్నట్టు సమాచారం.