ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 8 విభాగాల్లో తెలంగాణ పర్యాటక శాఖకు జాతీయ స్థాయి అవార్డులు ప్రకటించింది. ఈ సందర్భంగా ఢిల్లీ లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ వారసత్వ సంపద కలిగిన నగరంగా, టూరిజం విభాగంలో స్వచ్చత అవార్డులను వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ అందుకున్నారు. ఈ మేరకు ఈ రోజు ప్రగతి భవన్ లో మేయర్ నన్నపునేని నరేందర్ సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి అవార్డులను అందజేసారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ వరంగల్ నగర అభివృద్దిలో మేయర్ పనితీరును ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభినందించారు. ఈ అవార్డు మీ బాద్యతను మరింత పెంచిందని ఇదే ఒరవడితో ముందుకు వెళ్ళాలని మేయర్ నరేందర్‌కు సూచించారు.