ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆసీస్ టీం ఇండియా మధ్య నాల్గో వన్డే మ్యాచ్ మొదలైన సంగతి తెలిసిందే .ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది .మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కోహ్లీసేన ముందు 335 పరుగుల లక్ష్యం ఉంచింది. ఆ జట్టు ఓపెనర్లు అయిన వార్నర్ తన వందో వన్డేలో (124; 119 బంతుల్లో 12×4, 4×6) అద్భుత శతకం బాదేశాడు.
మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ (94; 96 బంతుల్లో 10×4, 3×6) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. చివర్లో పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (43; 30 బంతుల్లో), ట్రావిస్ హెడ్ (29) రాణించడంతో స్మిత్ సేన 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ (4/71) వన్డేల్లో వందో వికెట్ తీశాడు.అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు బీసీసీఐ చేసిన ట్వీట్లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఈ క్రమంలో మ్యాచ్ ఆరంభానికి ముందు బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో ‘భారత్-ఆసీస్ మధ్య తొలి టీ20కి స్వాగతం. తొలి టీ20లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది’ అని పేర్కొంది. వెంటనే గ్రహించిన నెటిజన్లు ‘బీసీసీఐ.. ఈ రోజు భారత్-ఆసీస్ మధ్య జరిగేది టీ20 కాదు నాలుగో వన్డే’ అని పేర్కొన్నారు. అంతేకాదు వాటిని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. వెంటనే తప్పును గ్రహించిన బీసీసీఐ తప్పును సరిదిద్దుకుంది. ముందుగా చేసిన ట్వీట్లను తొలగించింది. ఈ సందర్భంగా నెటిజన్లు చంద్రబాబు తనయుడు లోకేష్ ను మించి కామెడీ చేసింది అని సెటైర్లు వేస్తోన్నారు .