Home / NATIONAL / బాలుడు అలా చేయగానే భయపడిన చిరుత

బాలుడు అలా చేయగానే భయపడిన చిరుత

ఎంతో సాహసంతో చిరుతుపులి బారి నుంచి తన స్నేహితుడిని కాపాడుకున్నాడు. ఆశ్చర్యానికి గురిచేసే ఈ సంఘటన గుజరాత్ గిర్-సోమ్‌నాథ్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కోడినార్ పట్టణం సమీపంలో ఉన్న అరాతియా గ్రామానికి చెందిన ఏడేళ్ల జైరాజ్ గోహెల్, నీలేష్ స్నేహితులు. మంగళవారం సాయంత్రం జైరాజ్ తన ఇంటి ముందు ఖాళీ స్థలంలో నీలేష్‌తో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో పొదల చాటున నక్కి ఉన్న చిరుతపులి ఒక్కసారిగా నీలేష్‌పై దాడిచేసింది. అతన్ని నోటితో కరిచి పొదల్లోకి లాక్కేళ్లే ప్రయత్నం చేసింది.

సాధారణంగా వేరే పిల్లలైతే చిరుతను చూసి అక్కడి నుంచి పారిపోవడమో, లేదంటే సాయం కోసం అరవడమో చేస్తారు. కానీ జైరాజ్ అలా చేయలేదు. ఎలాంటి బెరుకూ లేకుండా రాయి తీసుకుని చిరుత మీదికి విసిరాడు. అయినా చిరుత నీలేష్‌ను వదల్లేదు. దీంతో తన వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ బొమ్మను తీసుకున్న జైరాజ్ దానికి కీ ఇచ్చి నీలేష్ వద్దకు విసిరాడు. అది వింత శబ్దం చేయడంతో దానికి భయపడిన చిరుత నీలేష్‌ను వదిలి అక్కడి నుంచి పారిపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న స్నేహితుణ్ని కాపడానికి తన తెలివి ఉపయోగించి ఎంతో సాహసం చేసిన జైరాజ్‌ను గ్రామస్థులతోపాటు గిర్ అభయారణ్య అటవీ శాఖ అధికారులు మెచ్చుకుంటున్నారు.

జైరాజ్ చదువుతున్న అరాతియా ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ ప్రతాప్ రాథోడ్ మాట్లాడుతూ.. ‘జైరాజ్ తెలివితేటలు, చిరుతను ఎదుర్కోవడానికి అతను చూపించిన ధైర్యం అనిర్వచనీయం. మా గ్రామ సర్పంచ్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతను పట్టుకోవడానికి వారు బోనులు ఏర్పాటుచేశారు’ అని చెప్పారు. ఎంతో సాహసంతో తన మిత్రుడిని కాపాడిని జైరాజ్‌ను సన్మానించేందుకు త్వరలోనే పాఠశాలలో కార్యక్రమం కూడా ఏర్పాటుచేయడానికి అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat