తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ మహానగరంలో నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఎల్బీస్టేడియం, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ మహా నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షల సంద ర్భంగా ఆయా ట్యాంక్‌బండ్, ఎల్బీస్టేడియం వైపు వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. ట్రాపిక్ ఆంక్షలు ఇలా ఉన్నాయి ..
– సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ పైకి వచ్చే వాహనాలను కర్బాల మైదానం వద్ద మళ్లిస్తారు.
– కట్టమైసమ్మ, కవాడిగూడ నుంచి చిల్డ్రన్స్ పార్క్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను డీబీఆర్ మిల్ వద్ద మళ్లిస్తారు.
– ఎక్బాల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ పైకి వెళ్లే ట్రాఫిక్‌ను సచివాలయం పాత గేటు నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా కట్టమైసమ్మ ఆలయం వైపు దారి మళ్లిస్తారు.
– ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు అనుమతించడంలేదు. నాంపల్లి, రవీంద్రభారతి వైపు మళ్లిస్తున్నారు
– అబిడ్స్ వైపు నుంచి వచ్చే వాహనాలు బీజేఆర్ విగ్రహం, బషీర్‌బాగ్ వైపు అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను నాంపల్లి, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు.
– ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్‌కు వచ్చే ట్రాఫిక్‌ను ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు దారి మళ్లిస్తారు.
– కింగ్‌కోఠి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలు కింగ్ కోఠి క్రాస్‌రోడ్డులో తాజ్‌మహల్ వైపు మళ్లిస్తారు.
– ఓల్డ్ పీసీఆర్ నుంచి బషీర్‌బాగ్‌కు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి వైపు మళ్లిస్తారు.
– హిల్ పోర్టు వైపు నుంచి వచ్చే వాహనాలు ఓల్డ్ పీసీఆర్ జంక్షన్ వద్ద దారి మళ్లిస్తారు, ఈ వాహనాలు బషీర్‌బాగ్‌పై అనుమతించరు.
– హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుంచి లిబర్టీ వెళ్లే వాహనాలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు మళ్లిస్తారు.
– పంజాగుట్ట, రాజ్‌భవన్ నుంచి ఖైరతాబాద్ ఫ్లె ఓవర్ పైనుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వైపు అనుమతించరు.