ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,మాజీ ముఖ్యమంత్రి అయిన ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు తనయుడుకి వెన్నుపోటు పొడిచారా ..?.సరిగ్గా ఇరవై యేండ్ల కిందట స్వర్గీయ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఇటు టీడీపీ పార్టీను అటు అధికారాన్ని రెండు హస్తగతం చేసుకొని ఎన్టీఆర్ చావుకు కారణమయ్యారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి .
తాజాగా దివంగత ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ మాజీ ఎంపీ ,టీడీపీ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయిన నందమూరి హరికృష్ణ కు వెన్నుపోటు పొడిచారు అనే వార్తలు వస్తోన్నాయి .గత కొద్ది కాలంగా హరికృష్ణ కు పార్టీ తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ పదవిచ్చి గౌరవిస్తాను .అందులో భాగంగా టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తా అని బాబు మాట ఇచ్చారు అంట .
కానీ ప్రస్తుతం వినిపిస్తోన్న వార్తల ప్రకారం టీటీడీ ఛైర్మన్ పోస్టు రాష్ట్ర ఆర్ధిక మంత్రి ,టీడీపీ సీనియర్ నేత అయిన యనమల రామకృష్ణుడు వియంకుడు అయిన సుధాకర్ యాదవ్ కు కట్టబెట్టాలని బాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు .అయితే గత కొంత కాలంగా బాబు తమ కుటుంబం పట్ల వ్యవహరిస్తోన్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న నందమూరి కుటుంబం ఈ విషయం తెలిసి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి .