టొమాటో పులిహోర తయారు చేయడానికి కావాల్సినవి :
శుభ్రంగా కడిగిన బియ్యం: పావుకిలో..
తాజాగా టొమాటోలు: పావుకిలో..
గింజలు లేని చింతపండుగుజ్జు: టేబుల్‌స్పూను..
తాజా పచ్చిమిర్చి: ఆరు..
ఇంగువ: చిటికెడు..
వేరుసెనగ పప్పు: మూడు టేబుల్‌స్పూన్లు..
సెనగపప్పు: రెండు టేబుల్ స్పూన్లు..
మినప్పప్పు: రెండు టేబుల్‌స్పూన్లు..
ఉప్పు: సరిపడా ..
ఎండుమిర్చి: నాలుగు మిర్చిలు ..
ఆవాలు: ఒక టీస్పూను..
నూనె: 100 మి.లీ..
కరివేపాకు: నాలుగు రెబ్బలు..
పసుపు: ఒక టీస్పూను..
టొమాటో పులిహోర చేయు విధానం :
ముందుగా కడిగిన టొమాటోలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి ఉడికించాలి.ఆ తర్వాత చల్లారాక చింతపండు గుజ్జు చేర్చి మెత్తగా అయ్యేవరకు రుబ్బాలి.మరోవైపు అన్నం ఉడికించి పక్కన ఉంచాలి.అయితే వెడల్పాటి బాణలిలో ఉడికించిన అన్నంలో టొమాటో గుజ్జు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి .బాణలిలో నూనె పోసి వేరుసెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పసుపు వేసి బాగా వేయించాలి. తరవాత కరివేపాకు కూడా వేసి వేగాక ఈ తాలింపును టొమాటో గుజ్జు కలిపిన అన్నంలో వేసి కలపాలి.టొమాటో పులిహోర తయారు అయింది .