తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధికి చెందిన కేంద్ర పర్యాటక శాఖకు చెందిన బెస్ట్ సివిక్ మేనేజ్‌మెంట్ ఆఫ్ టూరిస్ట్ డెస్టినేషన్ పురస్కారం లభించింది. నిన్న బుధవారం దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవంలో కేంద్ర పర్యాటకశాఖ కార్యదర్శి నుంచి నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ మహా నగర సమగ్రాభివృద్ధి కోసం జీహెచ్‌ఎంసీ చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై నివేదిక సమర్పించినట్లు అధికారులు తెలిపారు .అంతే కాకుండా ఈ నివేదిక ఆధారంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ జీహెచ్‌ఎంసీని అవార్డుకు ఎంపిక చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన విభాగాల సమష్టి కృషితో నగరానికి ఈ అరుదైన గౌరవం లభించినట్లు అన్నారు .