ఏపీలో అప్పుడెప్పుడో గోదావరి పుష్కరాల సందర్భంగా గొప్పలకు వెళ్లి దాదాపు ముప్పై రెండు మంది భక్తుల చావుకు కారణమయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .అప్పట్లో ఈ ఉదాతంతం మీద ఇటు రాష్ట్ర స్థాయిలో అటు జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే రేగింది .ప్రస్తుతం రిపబ్లిక్ టీవీ ఫౌండర్ అర్నాబ్ గోసామి ఒకప్పుడు టైమ్స్ నౌ లో రాష్ట్ర మంత్రులతో సహా టీడీపీ ఎంపీలను ఒక దంచుడు దంచిన సంగతి అందరికి గుర్తు ఉండే ఉంటుంది .
తాజాగా రాష్ట్రంలో నిన్న అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుండి బుధవారం ఉదయం వరకు అనారోగ్యంతో ఆస్పత్రికి చేరిన వారికీ సరైన వైద్యం అందక పదిమంది మరణించిన సంగతి తెలిసిందే .ఐసీయూలో ఉన్న పదిమంది లో ఇద్దరు చిన్నపిల్లలు కావడం ఇక్కడ బాధాకరం .అయితే ఈ విషయాన్నీ ఇటు రాష్ట్ర స్థాయి ముఖ్యంగా బాబు ఆస్థాన మీడియాకి చెందిన వర్గాలు ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యులు సక్రమంగా ఉన్నారు .
ప్రయివేట్ ఆస్పత్రుల నుండి రావడం వలనే మరణించారు అని కలరింగ్ ఇచ్చిన కానీ జాతీయ మీడియా రిపబ్లిక్ టీవీ మాత్రం బాబు సర్కారు ను జాతీయ స్థాయిలో కడిగిపారేసింది.ఈ చర్చలో అర్నాబ్ గోసామీ బాబు నిర్లక్ష్యం వలనే పదిమంది అమాయకులు మరణించారు .రాష్ట్రంలో వైద్య రంగం క్షీణించి పోతుంది .ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి బాబు సర్కారు గాలిలో చక్కర్లు కొడుతుంది అని ఒక రేంజ్ లో రెచ్చిపోయి బాబు సర్కారు నిర్లక్ష్యాన్ని బయటపెట్టాడు .అంతే కాకుండా అప్పుడు బాబు నిర్లక్ష్యానికి ముప్పై మంది చనిపోతే ఇప్పుడు పదిమంది చనిపోయారు అని ..ముఖ్యమంత్రి హోదా లో ఉన్న బాబు పనితీరుకు ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలని టీడీపీ మంత్రులను ,బాబును ప్రశ్నించారు .