ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసలు మళ్లీ ఊపందుకున్నాయి. గతంలో టీడీపీ ఆకర్ష్ పేరుతో చేపట్టిన ఆపరేషన్‌లో వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోగా, వారిలో నలుగురికి మంత్రి పదవులు వరించాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రతిపక్ష పార్టీలోకి వలసలు మొదలయ్యాయి.
రాయల సీమ జిల్లాల నుంచి త్వరలో భారీగా వైసీపీలోకి చేరికలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర మాజీ మంత్రల పాటు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు, టీడీపీకి చెందిన పలువురు నేతలు జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం. దీంతో అధికార టీడీపీ డైలామాలో పడింది. 2019 ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అధినేత ఇప్పటి నుంచి రంగం సిద్ధం చేసుకోవడం టీడీపీలో కలవరం మొదలైంది. వలసలను ఆపేందుకు అధికార పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
మరి ముఖ్యంగా వైఎస్సార్ కుటుంబం కార్యక్రమానికి కర్నూల్ జిల్లాలో విశేష స్పందన వస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. బుగ్గన నియోజక వర్గంలోని ప్యాపిలి మండలం”కలచట్ల” పంచాయితీ గత 30 సవత్సరాలుగా టీడీపీకి కంచుకోట..ఒక రకంగా చేప్పాలంటే కెయి కులుంబం గెలుపుకు అత్యధికంగా మెజార్టీ వస్తున్న గ్రామం..అయితే ఈ కంచుకోటను డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బద్దలు కొట్టాడు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో బాగంగా మండంల నాయకులు రాంమూర్తి, శివనాగయ్య ,మిద్దెరాము, సురేంద్ర తదితరులు ఇంటింటికి తిరిగి 100 మందిని వైఎస్సార్ కుటుంబంలో చేర్పించారు. అంతేగాక జగన్ చేపట్టిన నవరత్నాలు గురించి ప్రజలకు వివరిస్తు 2019 లో ఏపీ సియంగా చూస్తామని ,మరికొంత మంది చేరే అవకాశం ఉందని తెలిపారు.