Home / ANDHRAPRADESH / ఏపీలో దారుణం -“అనంత “ప్రభుత్వ ఆస్పత్రిలో పెరుగుతున్న మృతుల సంఖ్య ..

ఏపీలో దారుణం -“అనంత “ప్రభుత్వ ఆస్పత్రిలో పెరుగుతున్న మృతుల సంఖ్య ..

ఏపీలో అనంతపురం జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మృతుల సంఖ్య రోజుకు పెరుగుతూ వస్తుంది .మొన్న మంగళవారం నిన్న బుధవారం రోజు నాటికీ మొత్తం పది మంది మృతి చెందారు అని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి .తాజాగా మరో ముగ్గురు మృత్యు వాత పడ్డారు అని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది .అయితే ఆస్పత్రిలో వైద్యులు సరైన వైద్యం అందించకే తమ కుటుంబ సభ్యులు చనిపోయారు అని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు .

అయితే చనిపోయిన పదమూడు మంది ప్రధాన జనరల్ ఆస్పత్రిలోని అక్యూర్డ్‌ మెడికల్‌ కేర్‌(ఏఎంసీ) వార్డులో జరగడం ఆశ్చర్యకరం .అయితే ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడం ..సరిపోయినంత ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా అందకపోవడం వలన చనిపోయారు అని వార్తలు వస్తోన్నాయి .అనంతపురం జిల్లా ప్రధాన కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో డైలీ ఎనిమిది వందల మందికి పైగా ఇన్‌పేషెంట్స్‌ గా వస్తుంటారు .ఈ క్రమంలో ఆస్పత్రిలో పలు వార్డుల్లో చికిత్స తీసుకుంటూ ఆరోగ్యం క్షీణిస్తే అలాంటి వారిని ఏఎంసీకి తరలించి చికిత్స చేస్తారు.అయితే సరైన చికిత్స అందకపోవడం వలన నిత్యం ఐదుగురు చోప్పునన్ మృతి చెందుతుంటారు అని అక్కడి వారు చెప్తున్నారు .

ఇప్పటివరకు మృతి చెందిన వారి వివరాలు ..
మృతుల వివరాలు – లక్ష్మిదేవి (25) – (నిమోనియా, సెప్టిసీమియా) కొట్టాలపల్లి, కణేకల్లు మండలం
– శ్రీరాములు (65) – (కిడ్నీ సమస్య) వైసీ పల్లి, కంబదూరు మండలం
– శారద (40) – (గుండె సమస్య) రాజీవ్‌కాలని, అనంతపురం
– ఓబన్న (95) – (తలలో రక్తం గడ్డకట్టి) బీజేపీ కాలని, అనంతపురం
– గంగమ్మ (45) – (తీవ్రమైన క్షయ), బొమ్మేపర్తి, రాప్తాడు మండలం
– ఆనంద్‌ (56) – (నిమోనియా), ఇరుపాపురం, గుత్తి మండలం
– సంజప్ప (70) – (ఊపిరితిత్తుల సమస్య), వేణుగోపాలనగర్, అనంతపురం
– తిరుపాల్‌ (55) – (ఊపిరితిత్తుల సమస్య), ముప్పాల, పెద్దవడుగూరు మండలం
– చెన్నమ్మ (80) – (రక్తహీనత, కిడ్నీ సమస్య), బీఎస్‌ నగర్, తాడిపత్రి
-కుళ్లాయమ్మ
-ఉమాదేవి
-హనుమక్క

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat