బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు అయిదు పదుల వయసు దాటినా సల్మాన్ పెళ్లి చేసుకోడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పెళ్లి పై పూర్తి వ్యతిరేకతతో ఉన్న సల్మాన్.. భర్త అవ్వాలని లేదు కానీ మంచి తండ్రిని అవ్వాలని ఉందని ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కొంతమంది అనాథ పిల్లలకి ఆశ్రమం కల్పిస్తున్నాడు. ఇక ఇప్పుడు సరోగసి ద్వారా తన వారసులను తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఇక సరోగసి ద్వారా తండ్రిగా మారి జీవితాన్ని ఆనందంగా గడుపుదామని డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు సరోగసీని ఆశ్రయించిన వారిలో దర్శకురాలు ఫరాఖాన్ ఉన్నారు. అలాగే ప్రముఖ నటుడు జితేంద్ర కుమారుడు తుషార్ కపూర్ తో పాటు స్టార్ హీరోలు షారుక్ ఖాన్ – ఆమిర్ ఖాన్ లు కూడా ఉన్నారు. రీసెంట్ గా కరణ్ జోహార్ కూడా ఇద్దరి పిల్లలకు తండ్రయ్యాడు. ఇప్పుడు వారిలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా చేరిపోతున్నట్లు తెలుస్తోంది.
