సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాఎగురవేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడి పిలుపునిచ్చారు. బెల్లంపల్లి శాంతిఖని గని దగ్గర నేడు టీబీజీకేఎస్ గేట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సంఘాలకు చెందిన 50 మంది కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ ఉందని అన్నారు . సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామని జాతీయ సంఘాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల్లో భాగంగా ఎంపీ బాల్క సుమన్ ఇవాళ శ్రీరాంపూర్ వర్క్‌షాప్ వద్ద ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
