తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ తెలంగాణ సమాజానికి చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు.స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అన్నిరంగాల్లో ముందంజ వేయటమే కొండా లక్ష్మణ్ లాంటి గొప్పవారికి మనం అందించగలిగే నిజమైన నివాళి అన్నారు. తమ ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తున్నదని సీఎం తెలిపారు.
