వ్యవసాయంతో పాటు పాడి రైతుల సంక్షేమం కోసం సీఎం కెసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు . సూర్యాపేట జిల్లా ఇమాంపేటగ్రామంలో పాడి రైతుల ఆద్వర్యంలో జరిగిన హరిత హారం కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.తెలంగాణా రాష్ట్రంలో సీఎం కెసీఆర్వ్యవసాయాన్ని పండుగలాగా మార్చారన్నారు. నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల వారికి లీటర్ పాలకు నాలుగు రూపాయల ఇన్సెన్టీవ్ ను ప్రకటించారని అన్నారు.దీంతో పాటు పాడి రైతులకు సబ్సీడీపై బర్రెలను కూడా అందిస్తున్నారన్నారు.సీఎం కెసీఆర్ కోరినట్లుగా ప్రతిఒక్క పాడి రైతు తమ ఇళ్ళలో ఆరు మొక్కలని పెంచుకోవాలని, హరిత హారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటాలని మంత్రి కోరారు.
