Home / ANDHRAPRADESH / జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్‌.. ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీ మ‌రో సంచ‌ల‌నం..!

జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్‌.. ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీ మ‌రో సంచ‌ల‌నం..!

ఏపీ రాజ‌కీయాల్లో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫీవ‌ర్ ఇప్ప‌టి నుండే మొద‌లైంది. ఒకవైపు టీడీపీ మ‌రోవైపు వైసీపీ ఎత్తులు పై ఎత్తులతో ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటూ దూసుకుపోతున్నాయి. జ‌న‌సేన కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సొంత‌గా బ‌రిలోకి దిగ‌బోతోందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. దీంతో తెలుగు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఇక వైసీపీకి నంద్యాల, కాకినాడ ఎన్నిక‌లు ఓట‌మితో వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం ఆవ‌రించిద‌ని తెలుస్తోంది. దీంతో. జ‌గ‌న్‌ పార్టీ నేతల్లోనే ఉన్న అయోమయాన్ని తొలగించడమే ప్రధానంగా పెట్టుకున్నారు. వైసీపీలో చేరేందుకు ఎవరూ ముందుకురారని టీడీపీ నేతలు పదేపదే వ్యాఖ్యానిస్తుండటం, నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయి ఉన్న వైసీపీ నేతల్లో జోష్ నింపేందుకు కొందరు సీనియర్ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఇందుకోసం వైసీపీ గేట్లు తెరవనున్నారు. అందుకే పాదయాత్రను వాయిదా వేసినట్లు కూడా లోటస్ పాండ్ వర్గాల వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు జగన్ కు టచ్‌లో ఉన్నారు. కొందరు మాజీ కేంద్రమంత్రులు, మాజీ రాష్ట్ర మంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే వారిని చేర్చుకుంటే జరిగే ప్రయోజనాలేంటి.. అక్కడ ఉన్న పార్టీ నేతలకు వచ్చే ఇబ్బందులేంటి.. అన్న అంశాలపై ప్రశాంత్ కిషోర్ టీం సర్వే ద్వారా నివేదిక ఆధారంగా నిర్ణ‌యం తీసుకుని జ‌గ‌న్ ముందుకు సాగ‌నున్నార‌ని స‌మాచారం. ఏది ఏమైనా వైసీపీలోకి సీనియ‌ర్ నాయ‌కులు వచ్చి చేరితే మ‌రింత పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని.. టీడీపీకి మాత్రం ఇది మింగుడు ప‌గ‌ని విష‌యం అని విశ్లేష‌కులు చ‌ర్చిచుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat