ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత చేపట్టిన వైయస్ఆర్ కుటుంబానికి ప్రజల నుండి విపరీతమైన స్పందన లభిస్తోంది. వైసీపీ శ్రేణులు ఊరువాడ తిరుగుతూ ప్రజలను వైయస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేరుస్తున్నారు. మొత్తం 20రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. నేటితో 16 రోజులు అయిన సందర్భంగా 45 లక్షల మంది ప్రజలు వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వామ్యమైనట్టుగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి వైయస్ఆర్ పాలనను గుర్తు చేయడంతో పాటు, టీడీపీ సర్కార్ వైఫల్యాలను వివరిస్తున్నారు.
ఇక ప్రజలు కూడా చంద్రబాబు సర్కార్‌పై తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై విసుగు చెందారన్నారు. జ్వరాలు, మంచినీటి సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన 108, 104 పథకాలు బాబు పాలనలో మూలనపడ్డాయన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్ పథకం అమలులో లేక విద్యార్థులు చదువు మానేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామ పంచాయతీలను చంద్రబాబు నిర్వీర్యం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి ప్రజనుండి విశేష స్పందన లభిస్తుందని పార్టీ నాయకులు ఫుల్ జోష్‌లో ఉన్నారని.. జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలో వైసీపీ మళ్ళీ పుంజుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.