గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. వ్యవసాయం, పాడీ, పంటలను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ మేలైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వరంగల్ అర్బన్ జిల్లా MGM ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కన ఉన్న పశువైద్యశాలలో ఆంబులెన్స్‌ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వరంగల్ నగరంలోని పశు యజమానులు, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అన్నారు. తమ జంతువులకు ఏదైనా జబ్బు చేస్తే టోల్‌ఫ్రీ నెంబర్ 1962 కు డయల్ చేస్తే నియోజకవర్గ పరిధిలో ఎక్కడికైనా అరగంటలో ఈ ఆంబులెన్స్ చేరుకుంటుంది.ఒక్క ఫోన్ కాల్‌తో వెటర్నరీ డాక్టరు మీ పశువుల కొట్టం ముందుంటాడని అన్నారు. దీని ద్వారా ఉచితం వైద్యం ,మందులు లభిస్తాయి అని అన్నారు గత పాలకులు తెలంగాణ రైతులను నిర్లక్ష్యం చేశారని, రైతును ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే తమ ప్రభుత్వ ధేయ్యమని పేర్కొన్నారు .