తెలుగు చిత్ర పరిశ్రమకి సంక్రాంతి, దసరా సీజన్స్ వస్తే చాలు స్టార్‌ల సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడుతూ ఉంటుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద స్టార్‌ల మధ్య పోటీ కూడా చాలా రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ దసరాకి పోటీలో మూడు చిత్రాలు ఉన్నాయి. ఒకటి ఎన్టీఆర్ నటించి జై లవ కుశ చిత్రం గత వారమే విడుదల అయ్యి వారంలోనే వందకోట్లు కలెక్ట్ చేసి దూసుకుపోతుంది. జైలవకుశలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో విశ్వరూపం చూపించాడు. దీంతో సినిమాలో చిన్న చిన్న మైనస్‌లు ఉన్నా అవేమి జైలవకుశ పై ఎఫెక్ట్ పడలేదు. జై పాత్రలో అయితే ఎన్టీర్ నటన పీక్‌లోకి వెళ్ళి థియేటర్‌లో ప్రేక్షకులను హోరెత్తించేలా చేయడంతో జై లవ కుశకి జై కొట్టారు ప్రేక్షకులు.
ఇక రెండవది మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం ఈ బుధవారమే విడుదల అయ్యింది. అయితే ఈచిత్రం మొదటి షో నుండే మిక్స్‌డ్ టాక్ బయటకి వచ్చింది. తుపాకీ, కత్తి సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన మురుగదాస్ దర్శకత్వం లో మహేష్ నటించడంతో ఈ సినిమా ఫై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడం లో స్పైడర్ కాస్త వెనుకపడిందని ప్రేక్షకులు అంటున్నారు. మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా బాగానే చేసినప్పటికీ కథ, కథనం లోపం వల్ల సినిమా అనుకున్న రేంజ్ లో లేదని తేల్చేశారు ప్రేక్షకులు.
ఇక మూడవ చిత్రం శర్వానంద్ నటించిన మహానుభావుడు చిత్రం వచ్చే శుక్రవారం ప్రేక్షకులను పలకరించనుంది. మారుతి దర్శకత్వ వహిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్ అంటే మారుతి నుండి గతంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ చిత్రంలాంటి ఛాయలు ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతోందని… ఒక వేల హిట్ టాక్ సొంతం చేసుకున్న జై లవ కుశను కలెక్షన్లను బీట్ చేసే ఛాన్సే లేదని.. రివ్యూల పరంగా చూసినా స్పైడర్‌కి 2.5/5 వస్తే జై లవ కుశకి- 3/5 వచ్చిన సంగతి తెలిసిందే. మహానుభావుడు ప్లేవర్ చూస్తుంటే మాగ్జిమమ్ 2.75 /5 వచ్చే అవకాశం ఉందని ఈ దసరాకి బాక్సాఫీస్ మగాడు మొనగాడు జై అని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.