తెలంగాణ రాష్ట ప్రజలకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఒక ప్రకటన లో బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే పూలను పూజించే…ప్రకృతి ని ప్రేమించే పండగ బతుకమ్మ అని అన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని మంత్రి చెప్పారు. రాష్ట్ర సంస్కృతి ,సంప్రాదాయాలను ప్రపంచ దేశాలకు అద్దం పట్టేల ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఇలాంటి సంస్కృతి ని భావితరాలకు అందించాలని కోరారు. కుటుంబ సమేతంగా బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మంత్రి కోరారు.