ఈ రోజు తెలంగాణ రాష్టం లోని పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో రూ.4.5 కోట్లతో ఏర్పాటు చేయనున్న నూతన పోలీసు స్టేషన్ భవన నిర్మాణానికి తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శాంతి భద్రతలకు పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తోందన్నారు. శిథిలావస్థలో ఉన్న పోలీసు స్టేషన్ భవనాలను పునర్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు పోలీసులంటే భయం పోవాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. త్వరలో రామగుండం కమిషనరేట్ అధునాతన భవనాని నిర్మిస్తామని డీజీపీ తెలిపారు. పోలీసు శాఖలో త్వరలోనే 26వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రతి పోలీసు స్టేషన్ లో 33 శాతం మహిళా సిబ్బంది ఉండేగా చర్యలు తిసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు హౌసింగ్ కార్ఫొరేషన్ ఛైర్మన్ దామోదర్, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ,ఎమ్మెల్సీలు భానుప్రసాద్, నారదాసు లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.