తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి మహేందర్ రెడ్డి కొనియాడారు. ఇవాళ పట్టణంలోని ఫ్లాగ్ గ్రౌండ్‌లో జిల్లా స్థాయి బతుకమ్మ సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివ్య, ఎంఎల్‌ఏ సంజీవరావు, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మహేందర్ రెడ్డి… పూలను, ప్రకృతిని, మహిళా శక్తిని పూజించే ఏకైక సంప్రదాయం తెలంగాణ ప్రజలకే దక్కుతుందన్నారు. బతుకమ్మ వేడుకలను తెలంగాణ మహిళలు సంబురంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ రూ. 222 కోట్ల నిధులతో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారన్నారు. జిల్లాలో మొత్తం 2 లక్షలా 95 వేల చీరలను అందించామని మంత్రి తెలియజేశారు.